ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు కమల్ డ్రీంని నెరవేరుస్తారా?

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు కమల్ డ్రీంని నెరవేరుస్తారా?

Published on Feb 18, 2014 7:34 PM IST

Fox-Star-Studios,-fulfillin

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఏ సినిమా మొదలు పెట్టినా అందరి దృష్టీ ఆ సినిమాపైనే ఉంటుంది. ఎందుకంటే తన సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథని ఎంచుకుంటారు. అలా కమల్ హాసన్ తన డ్రీం ప్రాజెక్ట్ గా మొదలు పెట్టిన సినిమా ‘మృదగనాయగన్’. ఈ సినిమా మొదలు పెట్టి కొన్ని సీన్స్ తీసిన కమల్ హాసన్ బడ్జెట్ విషయంలో ఇబ్బడి వచ్చి సినిమాని మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా అది సెట్స్ పైకి వెళ్ళడం లేదు.

తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేయార్ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారిని ‘మృదగనాయగన్’ బాధ్యతలు తీసుకొని, ఆ సినిమాని పునఃప్రారంభించి, కమల హాసన్ డ్రీం ని నెరవేర్చాలని కోరాడు. వారు కూడా అక్కడ సముఖత చూపారు. దాంతో ఇప్పుడు అందరూ ఈ ‘మృదగనాయగన్’ సినిమాని మళ్ళీ సెట్స్ పైకి తీసుకెళ్ళి కమల్ కోరికను నెరవేరుస్తారా లేదా అనేది ఆలోచిస్తున్నారు.

కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం 2’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు