కార్తికేయ, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చావు కబురు చల్లగా చిత్రం మార్చి 19 వ తేదీన ధియేటర్ల లో విడుదల అయ్యేందుకు సిద్దంగా ఉంది. ఈ చిత్రం నుండి ఫిక్స్ అయిపో అంటూ విడుదల అయిన పాత యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో బస్తీ పోరాడి గా మన హీరో కార్తికేయ కనిపించనున్నారు. ఈ పాట శివరాత్రి పండుగ రోజున ఉదయం 11 గంటలకు విడుదల అయింది. హీరోయిన్ ను టీజ్ చేస్తూ హీరో వేసే స్టెప్పులు అదుర్స్ అనేలా ఉన్నాయి. అయితే ఈ పాట కి యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. మరొక మాస్ బీట్ అని, పండుగ రోజున మంచి గిఫ్ట్ అంటూ చెప్పుకొస్తున్నారు. పాట ను బట్టి చూస్తే సినిమా పక్క హిట్ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే రాహుల్ సిప్లిగంజ్, ఆదిత్య కలిసి పాడిన ఈ పాటకి లిరిక్స్ కౌశిక్ పెగల్లపాటి, సనారే అందించగా, జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన ప్రతి విషయం కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
వీడియో సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి