మొదటి షెడ్యూల్ ను ముగించుకున్న ‘ఉలవచారు బిర్యాని’

Prakash-Raj
ఇండియాలో ఉన్న విలక్షణ నటుల జాబితాలో ప్రకాష్ రాజ్ ముందువరుసలో వుంటాడు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ‘ఉలవచారు బిర్యానీ’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు తమిళ మరియు కన్నడ భాషలలో తెరకెక్కిస్తున్నాడు

ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 26న మైసూరులో మొదలైంది. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను కూడా ముగించుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ఈ సినిమా మలయాళం చిత్రం ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ కు రీమేక్. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ఎస్.పి బాలసుబ్రమణ్యం, స్నేహ మరియు ఊర్వశి ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాక ‘ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్’ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు

Exit mobile version