‘ప్రేమ కావాలి’ తో ఇండస్ట్రీకి పరిచయమై ‘లవ్లీ’ సినిమాతో లవ్లీ బాయ్ అనిపించుకున్న ఆది మూడవ ప్రయత్నంగా తీసిన ‘సుకుమారుడు’ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర మిశ్రమ ఫలితాన్ని రాబట్టుకుంది. కెరీర్లో నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తున్న ఆదిని ఇతర భాషల్లో ఎప్పుడు సినిమాలు చేస్తారని అడిగితే ‘ మనం పరిచయమైన భాషలో నటుడుగా నిరూపించుకొని, ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలి. అప్పుడే వేరే బాషల గురించి ఆలోచించాలి. వేరే భాషల్లో సినిమాలు చేస్తే మనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. నాన్నగారికి కన్నడ, తమిళ భాషల్లో మంచి పేరు ఉండడం వల్ల ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయి కానీ వాటిని నేను అంగీకరించలేదు. ముందు తెలుగులో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలి ఆ తర్వాతే వేరే భాషల్లో సినిమాలు. వేరే భాషల్లో సినిమా చెయ్యాలంటే సరైన సమయం, సరైన అవకాశం రావాలి అది రాగానే చేస్తానని’ ఆది అన్నాడు.