ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన గ్లోబల్ సెన్సేషనల్ సిరీస్.. రికార్డుల పాతరేస్తుందా

sT5

ఇప్పుడు ప్రపంచ ఓటిటి ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ఏదన్నా ఉంది అంటే అది దిగ్గజ స్ట్రీమింగ్ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి రానున్న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 అనే చెప్పాలి. గ్లోబల్ వైడ్ గా మొదటి నాలుగు సీజన్స్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఆఖరి సీజన్ ఈ 2025 ఏడాది ముగింపుగా నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసింది.

దీనితో మరింత ఎగ్జైటెడ్ గా ఈ సిరీస్ ని చూడాలని ఎదురు చూస్తున్న ఈ బిగ్ డే రానే వచ్చింది. మొత్తానికి పాన్ ఇండియా సహా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని భాషల్లో ఈ సిరీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మరి ఈ సీజన్ మొదటి పార్ట్ లో మొత్తం 4 ఎపిసోడ్స్ ని స్ట్రీమింగ్ కి తీసుకురాగా ఇందులో ఒకో ఎపిసోడ్ గంటకి పైగానే ఉంది. మరి ప్రపంచ ఆడియెన్స్ ఎదురు చూస్తున్న ఈ సీజన్ ఎలాంటి కొత్త రికార్డులు సెట్ చేస్తుందో చూడాల్సిందే.

Exit mobile version