అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా టాలెంటెడ్ నటి సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. మరి నాగ చైతన్యకి సాలిడ్ కం బ్యాక్ లా కూడా నిలిచిన ఈ సినిమా థియేటర్ రన్ తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేసింది.
ఇక ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో నేటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయినా ఒకవేళ చూసినా కూడా ఈ బ్యూటిఫుల్ చిత్రాన్ని ఇంకోసారి డెఫినెట్ గా చూడొచ్చు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా ఇది సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ అయ్యింది. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి