బైలుతో జైలు నుంచి రియా విడుదల..కానీ..!

బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత కొన్ని నెలల కిందట ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ నుంచి ఆ కేసులో గట్టిగా వినిపిస్తూ వచ్చిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ అయిన ఈమె వెలుగులోకి రావడంతో ఆ కేసులో అనేక కోణాలు బయటకొచ్చాయి. ఇక అదే అనుకుంటే ఆ తర్వాత ఆమెకు సంబంధించి మరిన్ని విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.

డ్రగ్స్ కేసు విషయంలో ఆమె గత నెల రోజుల కితం ఆమెను ఎన్ సి బి వారు అరెస్ట్ చేసారు. ఇక అక్కడ నుంచి ఆమె బెయిల్ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించింది కానీ ప్రతీసారి చుక్కెదురయింది. కానీ మొత్తానికి మాత్రం ఆమెకు ఇప్పుడు ఉపశమనం దొరికింది. పలు నిబంధనలతో ముంబై కోర్టు వారు ఆమెకు బైలు మంజూరు చేసినట్టుగా నిర్దారణ అయ్యింది.

అందులో భాగంగా ఆమె ఈ రోజు సాయంత్రం విడుదల కానుంది. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఏమిటంటే ఆమెతో పాటు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఆమె సోదరుడు సోవిక్ కు బైలు మంజూరు చెయ్యడానికి మాత్రం ముంబై కోర్టు తిరస్కరించి. రియా ఎట్టి పరిస్థితుల్లో ముంబై దాటి పోకూడదని హెచ్చరించింది.

Exit mobile version