తెలుగు బుల్లితెరపై ఉన్న బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియా లోనే హైయెస్ట్ రేటింగ్ మన తెలుగు వెర్షన్ కి ఉంది. ఇలా బిగ్ బాస్ మొత్తం 8 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకొని ఇపుడు 9వ సీజన్ లోకి అడుగు పెట్టింది. ఇక ఈసారి సీజన్ ని మరింత టఫ్ గా ప్లాన్ చేయగా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.
అయితే బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలు పెట్టక ముందు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అంటూ చిన్న గ్లింప్స్ లాంటి షో మొదలు పెట్టి ఇప్పుడు ఫైనల్ గా బుల్లితెరపై ఎపుడు మొదలు అవుతుంది అనేది డేట్ వచ్చేసింది. దీనితో మొత్తానికి బిగ్ బాస్ ఈ సెప్టెంబర్ 7న గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనితో బిగ్ బాస్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఇదో బిగ్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.