మొత్తానికి ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆన్లైన్ మాస్ సెలబ్రేషన్స్ అంటే ఏంటో మరోసారి చూపించారు. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో కాదు, మన ఇండియాలో కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రికార్డును తమ వసం చేసుకున్నారు. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కడా లేని విధంగా హీరోల కోసం ట్విట్టర్ లో మన వారు భారీ ట్రెండ్స్ చేస్తుంటారు.
ఇప్పుడు ఆ ట్రెండ్స్ వేలు, లక్షల్లో నుంచి కోట్ల వరకు వెళ్లి వరల్డ్ రికార్డు దగ్గర ఆగింది. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా వారు జస్ట్ లో మిస్ చేసుకున్న వరల్డ్ రికార్డు ను పవన్ అభిమానులు ఇప్పుడు కేవలం కామన్ డీపీ ట్రెండ్ తోనే సుసాధ్యం చేసి ప్రపంచంలోనే అత్యధిక ట్వీట్లు కలిగిన హ్యాష్ ట్యాగ్ ను పవన్ పేరిట నమోదు చేసారు.
#PawankalyanBirthdayCDP అనే హ్యాష్ ట్యాగ్ పై కేవలం 23 గంటల 12 నిమిషాల్లో 60.3 మిలియన్ ట్వీట్స్ వేసి ఆల్ టైం వరల్డ్ రికార్డును సెట్ చేసి పవన్ కళ్యాణ్ పేరిట ఒక వరల్డ్ ను అందించారు. అలాగే మొత్తం 24 గంటల వ్యవధిలో 65 మిలియన్ ట్వీట్లు వేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు. మరి దీనికే ఇలా ఉంటే వచ్చే సెప్టెంబర్ 2 వ తారీఖున చేసే ట్రెండ్ ఎలా ఉంటుందో చూడాలి.