మొత్తానికి అనుష్క ‘ఘాటీ’ నుంచి సాలిడ్ అప్డేట్ రెడీ!

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క నుంచి రాబోతున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఘాటీ”. దర్శకుడు క్రిష్ జాగర్లమూరి కలయికలో చేస్తున్న ఈ సినిమా పట్ల ఎప్పుడు నుంచో మంచి హైప్ ఉంది. అయితే చిత్రీకరణ ఎపుడో పూర్తయ్యింది కానీ విడుదల ఎప్పుడు అనేది మాత్రం ఒకింత సస్పెన్స్ గానే మారింది. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని సిద్ధం చేశారు.

రేపు జూన్ 2 న మధ్యాహ్నం 3 గంటల 33 నిమిషాలకి ఒక అనౌన్సమెంట్ ఇవ్వనున్నట్టుగా లాక్ చేశారు. మరి ఇది దాదాపు కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించి అనే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు కూడా నటిస్తుండగా విద్యా సాగర్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్ వారు పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని విడుదలకి సిద్ధం చేస్తున్నారు.

Exit mobile version