‘ఫౌజీ’ రిలీజ్‌పై మేకర్స్ సాలిడ్ స్ట్రాటెజీ..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీ ‘ఫౌజీ’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ సాలిడ్ స్ట్రాటెజీ ప్రకారం వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. 2025 చివరినాటికి ఈ మూవీ షూటింగ్ ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని.. 2026 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.

దీని కోసం కావాల్సిన ప్రొడక్షన్‌ను ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నిర్మాతలు అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ మూవీ రిలీజ్‌పై మేకర్స్ స్ట్రాటెజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Exit mobile version