‘ఫౌజీ’ పుకార్లపై డైరెక్టర్ క్లారిటీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ఓ పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ వార్త వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ఈ సినిమా కథను దర్శకుడు హను రాఘవపూడి తొలుత వేరొక హీరోకి చెప్పాడని.. ఆ తర్వాతే ప్రభాస్‌తో ఈ సినిమాను స్టార్ట్ చేశాడనే టాక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దర్శకుడు హను ఈ సినిమా కథను ముందుగా న్యాచురల్ స్టార్ నానికి వినిపించాడని వార్తలు వినిపించాయి. అయితే, తాజాగా హను రాఘవపూడి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. తాను ఈ చిత్రాన్ని ప్రభాస్‌ను దృష్టిలో పెట్టుకునే రాశానని.. ఈ మూవీ కథ షూటింగ్ జరుగుతున్న కొద్దీ డెవలప్ అవుతోందని ఆయన చెప్పుకొచ్చారు.

దీంతో ‘ఫౌజీ’ కథపై వస్తున్న పుకార్లకు డైరెక్టర్ ఫుల్‌స్టాప్ పెట్టాడని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version