లెజెండ్ కోసం స్పెషల్ ప్లాన్స్ చేస్తున్న ఫాన్స్

లెజెండ్ కోసం స్పెషల్ ప్లాన్స్ చేస్తున్న ఫాన్స్

Published on Mar 24, 2014 5:36 PM IST

legend
ఈ సమ్మర్లో అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘లెజెండ్’ ఒకటి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మూవీలో బాలకృష్ణ లుక్ కి కామన్ మాన్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్స్ లో వచ్చిన డైలాగ్స్ అభిమానులకు విపరీతంగా నచ్చేసాయి. ఈ సినిమా రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఫాన్స్ స్పెషల్ ప్లాన్స్ వేస్తున్నారు.

చాలా మంది బాలకృష్ణ అభిమానులు మన రాష్ట్రంలోని అన్ని పెద్ద సిటీలలో బైక్ ర్యాలీలు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ఇప్పటికే స్పెషల్ కటౌట్స్, బ్యానర్స్ ని రెడీ చేస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్.

ఇలా చేస్తున్న ప్రచారం ఈ సినిమాకి హెల్ప్ అవుతుందా? ఇలా పెరిగిన అంచనాలను సినిమా అందుకుంటుందా? అనేవి తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు