అల్లు అర్జున్ – అట్లీ మూవీ పట్టాలెక్కేది ఇంకెప్పుడు..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం 2024 డిసెంబర్ 4న రిలీజై బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అయితే, ఈ సినిమా వచ్చి దాదాపు ఆరు నెలలు అయింది. బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో ఇప్పటికే అనౌన్స్ చేశాడు.

కానీ, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? ప్రస్తుతం బన్నీ ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌ను కూడా వేధిస్తున్న ప్రశ్న ఇది. పుష్ప చిత్ర ఫ్రాంచైజీ కోసం ఏకంగా 5 ఏళ్ల సమయం తీసుకున్న బన్నీ, తన లాస్ట్ మూవీ వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంకా తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రారంభించలేదు.

దీంతో బన్నీ ఇకనైనా స్పీడ్ పెంచాలని.. మిగతా స్టార్ హీరోల మాదిరిగా ఆయన కూడా వరుస ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంపై బన్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Exit mobile version