మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం, ఈ అభిమాన గణం – వెంకటేష్

మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన వరం, ఈ అభిమాన గణం – వెంకటేష్

Published on Nov 27, 2013 9:00 PM IST

Venkatesh-joins-SVSC
తెలుగు సినీరంగానికి 25 సంవత్సరాలుగా సేవలందిస్తున్న తారలలో వెంకటేష్ ఒకరు. ‘కలియుగ పాండవులు’ నుంచి ‘మసాలా’ వరకూ వివిధ సినిమాలలో విభిన్న పాత్రలను పోషించాడు

గతకొన్ని సంవత్సరాలుగా మల్టీ స్టారర్ సినిమాలపై ఆసక్తి కనబరిచాడు. ఈ నిర్ణయం ఎంతో మంది యువ రచయితలకు, దర్శకులకు మంచి కధలను అందించే అవకాశాన్ని కల్పించింది. ప్రతీ ఒక్కరికీ ఒక్కో శైలి వుంటుందని, అందరికంటే తెలుగు సినిమాని హిట్ అయినా ఫ్లాప్ అయినా అభిమానించే అభిమానులు వుండడం మన వరమని, వారి అభిమానం ఉన్నంత వరకూ ఎప్పటికీ ఈ రంగం కళకళలాడుతుందని తెలిపాడు.

అతని మంచితనం, దైవచింతన తెలుగు ఇండస్ట్రీలో అభిమానులను సంపాదించిపెట్టాయి. ప్రస్తుతం వెంకటేష్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా 2014 జనవరిలో ప్రారంభంకానుంది

తాజా వార్తలు