హైదరాబాద్లో ముగిసిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ సందడి

pawan-kalyan-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న సినిమా షూటింగ్ వద్ద పవన్ ఫాన్స్ హంగామా ఎక్కువైంది. గత కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సిటీ సెంటర్లో జరుగుతోంది. అది తెలిసినప్పటి నుంచి పవన్ ఫాన్స్ అక్కడ గుమికూడారు. అక్కడికి వచ్చిన కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసారు, అంతే కాకుండా అవి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కొత్త లుక్ అందరికీ బాగా నచ్చుతోంది.

త్రివిక్రమ్ – నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ అక్కడ ఉన్నవారిని ఫోటోలు తీయొద్దని చెప్పగా తీయడం మానేశారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటించనుంది. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా యూనిట్ షూటింగ్ కోసం త్వరలోనే పొల్లాచ్చి వెళ్లనున్నారు, ఆ తర్వాత స్పెయిన్ లో లాంగ్ షెడ్యూల్ జరగనుంది.

Exit mobile version