మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఫ్యామిలీ హీరో శ్రీ కాంత్ కలిసి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం రామేశ్వరంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రామ్ చరణ్ – శ్రీ కాంత్ లపై కొన్ని ఫ్యామిలీ సీన్స్ ని తీస్తున్నారు. శ్రీ కాంత ఈ సినిమాలో రామ్ చరణ్ కి యంగ్ బాబాయ్ గా కనిపించనున్నాడు.
రామేశ్వరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఈ సినిమా పొల్లాచ్చి, నాగేర్కిల్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. తమిళ్ యాక్టర్ రాజ్ కిరణ్ ఈ మూవీలో రామ్ చరణ్ కి తాతయ్యగా కనిపించనున్నాడు. కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు.