ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడధగ్గ సినిమా: సగటు ప్రేక్షకుడు

ఈ సినిమా కుటుంబ సమేతంగా చూడధగ్గ సినిమా: సగటు ప్రేక్షకుడు

Published on Dec 28, 2013 9:50 AM IST

Uyyala-Jampala
చిన్న సినిమాలలో కధ, కధనం చక్కగా వుంటే వాటిని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. మొన్నీమధ్యే విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ఈ వారంలో మనముందుకొచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలు దానికి ఉదాహరణలు. ప్రస్తుతం ‘ఉయ్యాల జంపాల’ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆనంద మధుర స్మృతలలో ఊపుతుంది. ఈ సినిమా హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి కేంద్రాలలో మంచి ప్రేక్షకాధారణను పొందుతుంది

చాలా తక్కువ బడ్జెట్ తో తీసినా మంచి టెక్నికల్ స్టాండర్డ్స్ తో తీసిన ఈ సినిమాలో రాజ్ తరుణ్, పునర్ణవి, ఆవికా గోర్ ప్రధానపాత్రధారులు. ఈ సినిమాను సన్ షైన్ సినిమా బ్యానర్ పై రాధామోహన్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సహనిర్మాత. డి సురేశ్ బాబు సమర్పకుడు. విరించి వర్మ దర్శకుడు

తాజా వార్తలు