అమలా పాల్ కీ తప్పని ఫేక్ బెడద

ఫేక్ ప్రొఫైల్ బెడద మరోసారి అమల పాల్ ని బాధిస్తుంది. కొద్దిరోజుల క్రితం ఈ భామ తన అభిమానుల కోసం ప్రత్యేకంగా @amala _ams మాత్రమే తన ట్విట్టర్ ప్రొఫైల్ ఐడి అని తెలిపారు. ఆమె పేరుతో పలువురు ఫేక్ ప్రొఫైల్ సృష్టిస్తున్నారు వాటిని నమ్మొద్దు అని కూడా చెప్పారు. ఆ ప్రొఫైల్ సృష్టించిన వారిని కూడా ఈ భామ డిలీట్ చెయ్యమని కోరారు. ఈరోజు కూడా మరో ఫేక్ ప్రొఫైల్ బయటపడటంతో ఈ భామ మరోసారి అభిమానులను ఫేక్ ప్రొఫైల్ గురించి చెప్పింది అంతే ఫేక్ ప్రొఫైల్ సృష్టించిన వారిని హెచ్చరించింది. ప్రస్తుతం ఈ భామ హైదరాబాద్లో “నాయక్” చిత్రం కోసం ఒక పాట చిత్రీకరణలో పాల్గొంటుంది. ఈ పాటకు లారెన్స్ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్, కాజల్ మరియు అమలా పాల్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ చిత్రానికి వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

Exit mobile version