వెంకీ కోసం స్పెషల్ సెటప్ రెడీ అయింది

వెంకీ కోసం స్పెషల్ సెటప్ రెడీ అయింది

Published on Dec 22, 2020 7:01 PM IST

కొద్దిరోజుల క్రితమే ‘ఎఫ్ 3’ చిత్రం లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సూపర్ హిట్ ‘ఎఫ్ 2’కు ఇది సీక్వెల్. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఈ సీక్వెల్ మీద మంచి క్రేజ్ ఉంది. ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ రేపు 23వ తేదీ నుండే మొదలుకానుంది. హైదరాబాద్లోని కొండాపూర్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ జరగనుంది. ఇందులో విక్టరీ వెంకటేష్ మాత్రమే పాల్గొననున్నారు. వెంకీ మీద కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ షెడ్యూల్ ముగిశాక మొదలయ్యే కొత్త షెడ్యూల్లో వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కూడ పాల్గొంటారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత అనిల్ రావిపూడి నుండి వస్తున్న సినిమా కావడం, ఈ ప్రాజెక్ట్ మీదున్న క్రేజ్ మూలంగా సినిమాపై బిజినెస్ వర్గాల్లోనూ డిమాండ్ ఉంది. ఇప్పటికే డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్, శాటిలైట్ హక్కులను ఒక ప్రముఖ టీవీ ఛానెల్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సీక్వెల్ డబ్బు నేపథ్యంలో ఉండనుంది. ‘ఎఫ్ 2’ కు మించిన ఫన్ ఇందులో ఉండేలా చూసుకుంటున్నారు అనిల్ రావిపూడి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

తాజా వార్తలు