చిత్రీకరణ పూర్తిచేసుకున్న ” దేవుడు చేసిన మనుషులు “


వేగంగా సినిమా తీయగల ప్రసిద్ద దర్శకుడు ” పూరి జగన్నాధ్ ” ,” మాస్ మహారాజ రవి తేజ ” కలయికలో రూపుదిద్దుకొంటున్న” దేవుడు చేసిన మనుషులు” చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చివరి షెడ్యూల్ ఇటలీలో చిత్రీకరణ జరుపుకొంటున్న ప్రొడక్షన్ సభ్యులు చిత్రం పూర్తయినట్టు దృవీకరించారు.ఎమిరేట్స్ విమాన ప్రయాణం ద్వారా ప్రొడక్షన్ సభ్యులు రేపు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు.’ ఇలియానా ‘ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు మరియు రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ నెలాఖరు లోగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నవి.

Exit mobile version