ప్రత్యేకం : మే నెలలో ‘శకుని’ ఆడియో

ప్రత్యేకం : మే నెలలో ‘శకుని’ ఆడియో

Published on Apr 26, 2012 11:22 AM IST


తమిళ స్టార్ నటుడు మరియు సూర్య తమ్ముడు అయిన కార్తి హీరోగా నటిస్తున్న ‘శకుని’ చిత్ర ఆడియో మే నెల రెండవ వారంలో విడుదల కానుంది. తమిళ్ మరియు తెలుగు రెండు భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ చిత్ర ఆడియో కూడా ఇరు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ మరియు ‘బావ’ వంటి చిత్రాల్లో నటించిన ప్రణిత హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్ దయాల్ దర్శకుడు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్లో విడుదల కావాల్సి ఉండగా తమిళనాడు సినీ పరిశ్రమ సమ్మె కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. రాజకీయాల మీద వ్యంగాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సురేష్ విడుదల చేయనున్నారు. కార్తి గత సినిమాలు అవర, యుగానికి ఒక్కడు, నా పేరు శివ వంటి సినిమాలు తెలుగులో విజయం సాధించడంతో ఈ సినిమా పై కూడా క్రేజ్ ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు