‘కింగ్’ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన గ్రాఫికల్ మానియా ‘డమరుకం’ సినిమా గురించి మా దగ్గర ఓకే ప్రత్యేకమైన సమాచారం ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న విడుదల చేయాలనుకున్నారు, ఆ తర్వాత ఒక్క రోజు ఆలస్యంగా అంటే అక్టోబర్ 12న విడుదల చేస్తామన్నారు. మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం పూర్తిగా దసరా బరి నుండి తప్పుకుంది.
ఈ చిత్ర గ్రాఫిక్స్ పనులు పూర్తవనందు వల్ల అక్టోబర్ 12 కల్లా రెడీ అయ్యే అవకాశం లేదని అలాగే అక్టోబర్ 24 వరకు విడుదలయ్యే అవకాశం కూడా లేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం అంతక ముందు వారమే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం విడుదలై థియేటర్లన్నీ బుక్ అయిపోయి ఉంటాయనే ఉద్దేశంతో అక్టోబర్ 24న సినిమాని విడుదల చేయడానికి అంత ఆసక్తి చూపడం లేదు. కావున ‘డమరుకం’ సినిమాకి దసరా అవకాశాన్ని మిస్ చేసుకోవడం తప్ప వేరే అవకాశం లేదు.