కంటితో సైతం నటించగలిగే ‘మహానటి’ సావిత్రి గారి వర్ధంతి నేడు.!

చరిత్రలో ఎంతో మంది ఉంటారు కానీ తమకంటూ ఒక చరిత్రను లిఖించుకొనే వారు మాత్రం అత్యంత అరుదుగా ఉంటారు. అలాంటి ఒక లెజెండరి నటినే ‘మహానటి’ సావిత్రి. అలనాటి తారలను తన నటనా చాతుర్యంతో మంత్ర ముగ్ధులను చేసిన ఈ అందాల జాబిలి గొప్పదనాన్ని అత్యద్భుతంగా నేటి తరాలకు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ మరియు దర్శకులు నాగశ్విన్ కీర్తి సురేష్ తో మరపించారు..

ఆ మహానటి జీవితంలోని ప్రతీ కీలక ఘటనను ఆమె మహా ప్రస్థానాన్ని చూపించారు. అందం, అభినయం, పట్టుదల, కంటితో సైతం నటించగలిగే చాతుర్యం అన్నిటినీ మించి కల్మషం లేని వ్యక్తిత్వం ఇలా ఎన్నో లక్షణాలు పుణికిపుచ్చుకుని నటనకు తానే ఓ చిరునామాగా నిలిచారు. చిన్న నాటి నుంచే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్టార్ హీరోలు దర్శకులు సైతం ఆమె కాల్షీట్లు కోసం ఎదురు చూసేంతగా శిఖరాగ్రాలను అందుకున్నారు.

అలాంటి మహానటి జీవితం ఎలా ఛిద్రం అయ్యింది మళ్ళీ తాను ఎదుర్కొన్న కష్టాల కోసం వింటే ఎవరికైనా సరే గుండె బరువెక్కి కళ్ళు చెమరుస్తాయి. ఇదే డిసెంబరు 6 వ తేదీన 1936లో జన్మించిన ఆమె ఇదే డిసెంబరు 26 సరిగ్గా ఇదే రోజున ఎన్ని పాఠాలను ఎన్ని తారలు మారినా ఎన్నో మధుర జ్ఞ్యాపకాలను రాబోవు తరాల నటులకు కావాల్సినంత స్ఫూర్తిని మిగిల్చి కాలం చెల్లించి స్వర్గస్థులు అయ్యారు. మరి ఈ 39వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయ నటీమణిని మరోసారి మనసారా స్మరించుకుందాం.

Exit mobile version