ఈ కంటెస్టెంట్ ని ప్రశంసించకుండా ఉండట్లేదు.!

ఈ కంటెస్టెంట్ ని ప్రశంసించకుండా ఉండట్లేదు.!

Published on Nov 18, 2020 11:06 AM IST

ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4, ఎనిమిది మంది కంటెస్టెంట్స్ తో 70 రోజుల ను దాటిన ప్రయాణంతో లాస్ట్ స్టేజ్ కు వస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఈ వారం నామినేషన్స్ అయితే ఓ రేంజ్ లో నడిచాయి. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోవడంలో చెప్పుకున్న కారణాలు మరింత హీటెక్కించాయి.

ముఖ్యంగా అయితే హారికా మరియు షోయెల్ ల నడుమ జరిగిన వాగ్వాదం అయితే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం హారిక పెట్టిన ఎఫర్ట్స్ చూసి ఇతర కంటెస్టెంట్స్ సహా ఆఫ్ లైన్ లో బిగ్ బాస్ ఫాలోవర్స్ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు.

బజర్ ను నొక్కడానికి చేసిన ప్రయత్నం నుంచి తర్వాత టైర్ తో చేసిన టాస్క్ లో ఆమె కాస్త గట్టిగానే హార్డ్ వర్క్ చెయ్యడంతో మంచి ప్రశంసలు ఇప్పుడు వస్తున్నాయి. దీనితో ఇప్పుడు ఈమె క్యాప్టెన్ రేస్ లోకి కూడా రావడంతో హౌస్ లో పరిణామాలు మరింత కీలకంగా మారాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు