వాయిదా పడ్డ ‘ ఇంగ్లీష్ వింగ్లీష్’ విడుదల

వాయిదా పడ్డ ‘ ఇంగ్లీష్ వింగ్లీష్’ విడుదల

Published on Aug 24, 2012 12:25 PM IST


చాలా కాలం గ్యాప్ తర్వాత ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రీ దేవి నటిస్తున్న ‘ ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్ర విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆక్టోబర్ 5న విడుదల చేయనున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న విడుదల చేయాలనుకున్నారు. ఆర్. బల్కి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరి షిండే దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో తమిళ హీరో అజిత్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. అజిత్ ఇటీవలే ముంబైకి చేరుకొని ఈ చిత్ర చిత్రీకరణలో పాల్గొన్నారు, ఆ సమయంలో అజిత్ సింప్లిసిటి చూసి గౌరీ షిండే ఆశ్చర్యపోయారు. ‘అజిత్ శ్రీ దేవి గారికి పెద్ద అభిమాని. అందువల్లే మేము ఈ చిత్రంలో అతిధి పాత్ర కోసం ఆయన్ని సంప్రదించినప్పుడు ఆయన ఏ మాత్రం సంకోచించకుండా నేను చేస్తాను అన్నారు. ఇటీవలే ఆయన పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించాము. అజిత్ తన సొంత డబ్బులతోనే ముంబైకి వచ్చారు మరియు కాస్ట్యూమ్స్ కూడా ఆయనే తెచ్చుకున్నారు. అజిత్ పై వచ్చే సన్నివేశాలను 12 గంటల పాటు చిత్రీకరించాము. ఆయన చిత్రీకరణ పూర్తవగానే ఆయన బయలుదేరి వెళ్ళిపోయారు’ అని గౌరి అన్నారు. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మరియు ప్రియా ఆనంద్ కి ఇది తొలి బాలీవుడ్ మూవీ.

తాజా వార్తలు