మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘నాయక్’ సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ ని చాలా ఉత్కంఠ భరితంగా చిత్రీకరిస్తున్నారు. ఈ ఇంటర్వల్ బ్లాక్ సినిమాకే హైలైట్ అవుతుందని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.
మాస్ మసాల చిత్రాలు తీయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న వి.వి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ మరియు అమలా పాల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ‘నాయక్’ సినిమాని 2013 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం యూరప్ లోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రంలోని పాటలను చిత్రీకరిస్తున్నారు.