రాజమౌళి ఈగకి దక్కిన మరో ప్రతిష్టాత్మక అవార్డ్

రాజమౌళి ఈగకి దక్కిన మరో ప్రతిష్టాత్మక అవార్డ్

Published on Jun 26, 2013 4:26 PM IST

Eega (2)

రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఈగ’ సినిమా ఇప్పటికే చాలా అవార్డ్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఖాతాలోకి మరో అవార్డ్ కూడా వచ్చి చేరింది. ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ విభాగానికి ఇంటర్నేషినల్ అవార్డు వచ్చింది. సినిమాని తన సెట్టింగులతో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు ‘బ్రెజిల్ ఫాంటాస్పోయ ఫిల్మ్ ఫెస్టివల్’ వారు ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డికి బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ ను ప్రకటించింది. ఇప్పటి వరకు వచ్చిన ఇండియాన్ సినిమాలన్నింటిలో మొట్టమొదటి ఆర్ట్ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్న సినిమా ‘ఈగ’.

ఈ విషయంపై ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ‘ ఈగ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసినందుకు ఆనందంగా వుంది. నాకు ఇంటర్నేషినల్ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని ఒక్క మాటలలో చెప్పలేను. ఈ సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి గారికి, నిర్మాతకి కృతజ్ఞతలు’ అని అన్నాడు.

తాజా వార్తలు