యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ ఫుల్ మాస్ చిత్రం “అరవింద సమేత వీర రాఘవ”. యాక్షన్ మరియు ఎమోషన్స్ తో కలగలిపి తెరకెక్కిన ఈ చిత్రంలో పూజాతో పాటు మన అచ్చమైన తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా కూడా నటించారు.
అయితే ఈ సినిమాలోని తారక్ ను తన హార్లే డేవిడ్ సన్ బైక్ పై ఎక్కించుకొని రైడ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పుడు అదే హార్లే డేవిడ్ సన్ బైక్ పై చేసిన మరో రైడ్ తాలూకా వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసారు.ఈ వీడియో అరవింద సమేత షూటింగ్ స్పాట్ లోది అని ఆమె వెల్లడించారు. ఈ అమ్మడు ఈ వీడియోలో ఆ బైక్ పై చాలా దూరమే ప్రయాణం చేసి రౌండ్ కొట్టింది. బహుశా తారక్ తో సీన్ కు ముందు ఇది ప్రాక్టీస్ సెషన్ అయ్యి ఉండొచ్చు.