ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన “ఈగ” చిత్రం కృష్ణా జిల్లాలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎలాంటి పెద్ద హీరో లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే 81 లక్షల షేర్ సాదించింది. ఈ చిత్రం అన్ని విభాగాల పరంగా మంచి ప్రశంసలు పొందుతోంది మరియు విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రం ఈ వారాంతం పూర్తయ్యే లోపు కృష్ణ జిల్లాలో సుమారు 2.5 కోట్లు కలెక్ట్ చేస్తుందని సినీ బిజినెస్ వర్గాలు భావిస్తున్నాయి.
సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సమంత కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సుదీప్ విలన్ పాత్రలో చాలా బాగా నటించారు. నాని ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించారు.