“ఈగ” చిత్రం మూడు రోజులకు గాను గోదావరి జిల్లాలో అద్భుతమయిన వసూళ్లను రాబట్టింది. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలలో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం తనదయిన సత్తా చూపిస్తుంది. ఈ చిత్రం తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులకు గాను 79.5 లక్షలు వసూలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కలెక్షన్లు 69 లక్షలుగా ఉన్నాయి. ఈ గణాంకాలు పరిశ్రమలో పెద్ద హీరోల చిత్రాల గణాంకాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. పెద్ద హీరోలు వసూళ్లు చేసే స్థాయిలో ఒక “ఈగ” వసూళ్లు రాబట్టింది అంటే దర్శకుడు రాజమౌళి కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దరిదాపుల్లో పెద్ద చిత్రాల విడుదల ఏది లేకపోవటంతో “ఈగ” తవ హవాని మరిన్ని రోజులు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.