ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” అన్ని చోట్ల అద్భుతంగా ఎగిరింది. ప్రదేశాల్లో మార్పు ఉన్న పరిస్థితుల్లో మార్పు లేదు ప్రతి చోట ఈ చిత్రం భారీ మొత్తంలో మొదటి రోజు వసూళ్లను రాబట్టింది. కృష్ణలో ఈ చిత్రం మొదటి రోజు 32 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం క్లాస్ మరియు మాస్ జనాన్ని ఆకట్టుకుంది. సుదీప్,సమంత మరియు నాని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర బడ్జెట్ ముప్పై కోట్లు ఉండగా ఈ కలెక్షన్లు నిర్మాతకి లాభాలు తేచ్చిపెట్టేలానే ఉన్నాయి.