థాయిలాండ్ మీద ఎగరబోతున్న ‘ఈగ’


అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి రూపొందించిన గ్రాఫిక్స్ మాయాజాలం ‘ఈగ’ త్వరలో థాయిలాండ్ మీద ఎగరబోతుంది. త్వరలో థాయ్ భాషలో డబ్ కానుంది. ఈ డబ్ వెర్షన్ ని వచ్చే ఏడాది 2013 లో విడుదల చేయబోతున్నారు. థాయిలాండ్ కి చెందిన ప్రముఖ డిస్ట్రి బ్యూటర్స్ ఈగని చూసి థాయ్ భాషలో డబ్ చేయాలని భావించి విడుదల చేస్తున్నట్లు సమాచారం. థాయిలాండ్ లో తెలుగు సినిమా షూటింగులు చాలా జరుగుతుంటాయి. ఈగ తరువాత మరికొన్ని సినిమాలు థాయ్ భాషలో డబ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఈగ తెలుగు భాషలో నిర్మించగా తమిళ్ భాషలో నాన్ ఈ పేరుతో విడుదలై అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన విషయం తెలిసిందే. అలాగే హిందీ భాషలో మక్కి పేరుతో కూడా విడుదల చేసారు

Exit mobile version