బాక్స్ ఆఫీస్ వద్ద రాజమౌళి ఆధిపత్యాన్ని కొత్తగా పరిచయం చెయ్యవలసిన అవసరం లేదు. చిత్రంలో స్టార్ లేకపోయినా జనాన్ని ధియేటర్ కి రప్పించగల అతి తక్కువమంది దర్శకులలో రాజమౌళి ఒకరు. “మగధీర” మరియు “ఈగ” వంటి చిత్రాలతో అయన తన స్థాయిని మరింత పెంచుకున్నారు. ఈ చిత్రాలు ఆయన్ని దక్షిణాదిన మాత్రమే కాకుండా బాలివుడ్లో కూడా మంది పేరుని సంపాదించి పెట్టాయి. తాజా సమాచారం ప్రకారం “ఈగ” చిత్రం బుల్లి తెరలో వచ్చినప్పుడు దాని టి ఆర్ పీ 18 చేరుకుంది. తెలుగులో “మగధీర” 22 టి ఆర్ పీ తో మొదటి స్థానంలో ఉండగా రజినీకాంత్ “రోబో” టి ఆర్ పీ 19 తో రెండవ స్థానంలో ఉంది “ఈగ” మూడవ స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ విలక్షణ దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ ప్రధాన పాత్రలో రానున్న చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్నారు. ఈ చిత్రం 2013లో మొదలు కానుంది.