నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని హెచ్ఐసిసి, నవోటల్ లో జరిగిన 60 వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో టాప్ అవార్డ్స్ ని ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ”ఈగ”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ”గబ్బర్ సింగ్” సినిమాలు కైవసం చేసుకున్నాయి. ఈగ, గబ్బర్ సింగ్, బిజినెస్ మాన్, జులాయి, రచ్చ, ఇష్క్, ఢమరుకం సినిమాలు కూడా పలు విభాగాల్లో నామినేట్ అవ్వగా అన్నిటి కంటే ఎక్కువ మరియు కీలకమైన అవార్డ్స్ ని ఈగ, గబ్బర్ సింగ్ సినిమాలు దక్కించుకున్నాయి. ఈగ చిత్రానికి గాను ఎస్ ఎస్ రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు, అలాగే ఈగ మూవీకి ఉత్తమ చిత్రం, బెస్ట్ హీరోయిన్ (సమంత), ఉత్తమ సహాయ నటుడు (సుదీప్), బెస్ట్ విఎఫ్ఎక్స్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి గాను బెస్ట్ హీరో అవార్డు సొంతం చేసుకున్నారు, అలాగే గబ్బర్ సింగ్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(దేవీశ్రీ ప్రసాద్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (వడ్డేపల్లి శ్రీనివాస్) అవార్డ్స్ వచ్చాయి. రైతుల దృష్ట్యా రామ్ చరణ్ అవార్డు అందుకున్నాడు. బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన ఈ వేడుకలో శృతి హాసన్, తదితర తారలు తమ డాన్సులతో అలరించారు. ఎఆర్ రెహమాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా, ధనుష్, అనిరుధ్ రవిచందర్, శృతి హాసన్, తమన్నా, యామి గౌతం, అల్లు శిరీష్, అమలా పాల్, ప్రియమణి, లక్ష్మీమంచు, నిఖీషాపటేల్,కృతి కర్భంద, చార్మీ తదితరులు ఈ వేడుకకి హాజరయ్యారు.