టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’. ఈ చిత్రం ఈ రోజుతో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రాల లిస్టులో ఈ చిత్రం కూడా చేరిపోయింది మరియు ‘ఈగ’ చిత్రం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఓవర్సీస్ లో అత్యధిక కలెక్షన్లు సాదించిన చిత్రాల వరుసలో కూడా ‘ఈగ’ సినిమా చేరిపోయింది. ఈ చిత్రంలో ఎక్కువ స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ మరియు సి.జి వర్క్ ఉండడం వల్ల ఈ చిత్రం సుమారు ఒకటిన్నర సంవత్సరం పాటు చిత్రీకరణ జరుపుకొంది.
రాజమౌళి ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అధునాతనమైన మేకింగ్ పద్దతులను మరియు సరికొత్త రకమైన యానిమేషన్ విధానాలను ఉపయోగించారు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. నాని, సమంత మరియు సుదీప్ ప్రధాన పాత్రలు పోషినచారు. ఈ చిత్రంలో ముగ్గురూ తమ నటనకు అందరి నుండి ప్రశంశలు అందుకున్నారు.