ఈ రోజుల్లో చిత్ర నిర్మాణ సంస్థ నుండి మరో చిత్రం

ఈ రోజుల్లో చిత్ర నిర్మాణ సంస్థ నుండి మరో చిత్రం

Published on Aug 12, 2012 7:04 PM IST


“ఈ రోజుల్లో” చిత్రం విజయం సాదించిన తరువాత ఆ చిత్రాన్ని నిర్మించిన బ్యానర్ గుడ్ సినిమా గ్రూప్ వారు మరో చిత్రాన్ని ప్రకటించారు. ఈ రోజుల్లో చిత్ర దర్శకుడు మారుతి, జి శ్రీనివాస్ రావు మరియు ఎస్ కే ఎన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డైలాగ్ రైటర్ గా “డార్లింగ్”,” హ్యాపీ”, “ఉల్లాసంగా ఉత్సాహంగా” వంటి చిత్రాలకు పని చెయ్యడమే కాకుండా చాలా కాలంగా కరునకరంకి అసోసియేట్ గా పని చేసిన స్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ రాబోతున్న చిత్రం “రెబెల్” కి కూడా స్వామి డైలాగ్స్ అందించారు. ఈ చిత్రం ఆగస్ట్ 13 న మొదలు కానుంది చిత్ర బృందం గురించిన విశేషాలు త్వరలో ప్రకటిస్తారు.

తాజా వార్తలు