బుల్లి తెర సుమన్ ఇక లేరు..


రామోజీ గ్రూప్స్ అధినేత అయిన రామోజీ రావు గారి కుమారుడు మరియు బుల్లి తెరపై మంచి పెరుతెచ్చుకున్న సుమన్ నిన్న రాత్రి అనారోగ్య కారణంగా చికిత్స పొందుతూ మరణించారు. సుమన్ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం సుమన్ కి వయసు 45 సంవత్సరాలు, ఆయన భార్య విజయేశ్వరి మరియు ఆయనకి ఇద్దరు పిల్లలు. సుమన్ భార్య విజయేశ్వరి రామోజీ గ్రూప్స్ లో భాగమైన డాల్ఫిన్ గ్రూప్ అఫ్ హోటల్స్ కి ఎం.డి గా వ్యవహరిస్తున్నారు.

1966 డిసెంబర్ 23న జన్మించిన సుమన్ తన చిన్న వయస్సులో మంచి విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ కి కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందించి సుమన్ సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా నటుడిగా కూడా ఈ టీవీ సీరియల్స్ లో కనిపించి శ్రోతలను ఆకట్టుకున్నారు.

సుమన్ అకాల మరణం కారణంగా రామోజీ రావు గారికి మరియు అతని కుటుంభ సభ్యులకు 123తెలుగు.కామ్ సంతాపాన్ని తెలియజేస్తోంది.

Exit mobile version