ముహూర్త కార్యక్రమాలతో లక్కీ భాస్కర్ కొత్త సినిమా

మళయాళ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా నుంచి మొన్న లక్కీ భాస్కర్ వరకు వరుస హిట్స్ ని తాను అందుకోగా తెలుగులో మంచి నిలకడ కనబరుస్తూ వచ్చాడు. ఇక లేటెస్ట్ గా లక్కీ భాస్కర్ తర్వాత తెలుగులో మరో తెలుగు సినిమా మొదలైంది. అదే “ఆకాశంలో ఒక తార”.

దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎపుడో అనౌన్స్ అయ్యింది కానీ ఈ సినిమా ఫైనల్ గా నేడు సినిమా ముహూర్త కార్యక్రమాలతో మొదలైనట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. నేడు హైదరాబాద్ లోనే దిగ్గజ నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్ అలాగే సురేష్ బాబు లాంటి వారు ఈ సినిమా లాంచ్ కి వచ్చారు. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో కొత్త హీరోయిన్ గా నటించనున్నట్టు తెలుస్తుంది.

Exit mobile version