అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా

Kaantha

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. ఆయన నటించే సినిమాలకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఇక ఆయన స్ట్రెయిట్ తెలుగు చిత్రాల్లో నటిస్తూ కూడా బిజీగా ఉన్నాడు. అయితే, ఆయన ప్రస్తుతం ‘కాంత’ చిత్రంతో పాటు DQ 41 చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

‘కాంత’ సినిమా పూర్తి పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ నిరూపించింది. కాగా, ఈ చిత్రాన్ని తొలుత సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభూతిని కలిగించేందుకు చిత్ర యూనిట్ శ్రమిస్తుందని.. ఇందుకోసం తాము మరికొంత సమయం తీసుకుంటున్నట్లు.. అందుకే ‘కాంత’ చిత్ర రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తుండగా సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version