యూఎస్ మార్కెట్ లో ‘డ్యూడ్’ సాలిడ్ ఓపెనింగ్స్!

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నేహా శెట్టి అలాగే మమిత బైజు హీరోయిన్స్ గా దర్శకుడు కీర్తిస్వరణ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “డ్యూడ్”. మంచి బజ్ ని తెలుగు, తమిళ్ లో సొంతం చేసుకొని రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ ని అందుకుంది. ఇలా ఇండియాలో మంచి బుకింగ్స్ తో ట్రెండ్ అవుతున్న డ్యూడ్ ఇక్కడే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సాలిడ్ ఓపెనింగ్స్ ని రిజిస్టర్ చేస్తుంది.

దీంతో ఈ సినిమా ఆల్రెడీ 2 లక్షల డాలర్స్ ని దాటేసి సాలిడ్ వీకెండ్ పై కన్నేసింది అని చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అనేది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించగా మన టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. ఈ దీపావళి కానుకగా థియేటర్స్ లో సందడి చేసేందుకు ఈ సినిమా వచ్చేసింది.

Exit mobile version