యంగ్ హీరో నిఖిల్ తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో నిఖిల్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక క్యారెక్టర్ కి మెమరీ లాస్ ఉంటుందని.. అలాగే మరోకటి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ గా ఉండబోతుందని సమాచారం. అలాగే ఈ సినిమా థీమ్ కూడా చాల కొత్తగా ఉంటుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.
కాగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఈ సినిమా రాబోతుంది. నిఖిల్ మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఇక ‘అర్జున్ సురవరం’తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నాడు నిఖిల్.