దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుత తరం తెలుగు సంగీత దర్శకులలో అగ్రస్థానంలోనిలిచే దిశగా పయనిస్తున్నాడు. కానీ తనకు నచ్చిన సంగీత దర్శకుడు ఎవరంటే మాత్రం ఆలోచించకుండా ఇళయరాజా పేరు చెప్పాడు. కోడి రామకృష్ణ ‘దేవి’ సినిమాకు ముందు కర్ణాటక సంగీతం నేర్చుకుని, మాండలిస్ట్ శ్రీనివాస్ శిష్యుడిగా పేరుపొందాడు. ఇళయరాజా పనితీరు ఆయనకు చాలా ఇష్టమట
సంగీత దర్శకుడు ఇళయరాజా ని దేవుడిగా కొలిచి తన ఇంట్లో పెద్ద కటౌటే పెట్టేసాడు దేవి. 2012లో ఒక ఆడియో వేడుకలో ఇళయరాజా దేవిని వేదికపై పిలిచి ఒక పాటని పాడమన్నాడు. అంతే ఆ రోజు ని నా జన్మలో మరిచిపోలేనని దేవి ఈరోజుకీ చెప్పుకుంటాడు. సినిమా రంగంలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా దేవుడు ఇళయరాజాని కలిసి ఆయన దీవెనలు అందుకున్నానని దేవి ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు
ప్రస్తుతం దేవి బాలకృష్ణ లెజెండ్ సినిమాకు అందించిన పాటలు విజయం సాధించడంతో ఆనందంలో వున్నాడు