ప్రారంభమైన దృశ్యం రీమేక్

ప్రారంభమైన దృశ్యం రీమేక్

Published on Feb 21, 2014 2:34 PM IST

Venkatesh

మలయాళం సూపర్ హిట్ సినిమా దృశ్యం ఈరోజు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. వెంకటేష్ సరసన చాలా కాలం తరువాత మీనా జంటగా నటించనుంది. రామానాయుడు, వెంకటేష్, సురేశ్ బాబు, రానా మరియు కొంతమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు

ఈ సినిమా తెలుగు వర్షన్ కు శ్రీప్రియ దర్శకత్వం వహించనుంది. ఈమె ఇటీవలే మాలిని 22 సినిమాను తెరకెక్కించింది. గతకొన్ని వారాలుగా వెంకటేష్ కు స్క్రిప్ట్ ను వినిపించే పనిలో వున్న ఈమె ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆనందం వ్యక్తం చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి

వెంకటేష్ కూతుళ్లగా నటించడానికి ఇద్ధరు అమ్మాయిలను వెతికేపని చిత్రబృందంలో వున్నారు.నదియా ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపనున్నారు

తాజా వార్తలు