తన డ్రీం రోల్స్ ఏంటో చెప్పిన సమంత

తన డ్రీం రోల్స్ ఏంటో చెప్పిన సమంత

Published on Feb 20, 2014 7:44 PM IST

Samantha (11)

ఇటు తెలుగు, అటు తమిళ్లో టాప్ హీరోలతో, టాప్ ప్రొడక్షన్స్ లో సినిమాలు చేస్తున్న అందాల భామ సమంత బాగా బిజీబిజీగా రోజులని గడుపుతోంది. సమంతకి ఈ రోజు కాస్త ఖాళీ సమయం దొరకడంతో తన అభిమానులు ట్విట్టర్ లో అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.

ఒక అభిమాని మీ డ్రీమ్ రోల్ ఏంటని అడిగితే ‘నాకు రొటీన్ కి కాస్త భిన్నంగా డార్క్ అండ్ ఇంటెన్స్ ఉన్న పాత్రలు చేయాలనుందని’ సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకూ ఎక్కువగా కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలే చేసిన సమంతకి భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు ఎవరన్నా ఇస్తారేమో చూడాలి.అలాగే నటన పరంగా మీ వీక్ పాయింట్ ఏమిటని అడిగితే ‘ నేను బాగా యారగెంట్ గా ఉండే పాత్రలు చేయలేనని’ సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం సమంత తెలుగులో ఎన్.టి.ఆర్ సరసన ‘రభస’, ‘మనం’, వివి వినాయక్ సినిమాల్లో నటిస్తోంది. తమిళంలో సూర్య, విజయ్ ల సరసన ఒక్కో సినిమా చేస్తోంది. ఇవి కాకుండా ‘ఆటోనగర్ సూర్య’ సినిమా త్వరలో విడుదలకు సిద్దమవుతోంది.

తాజా వార్తలు