ఫేక్ అకౌంట్ పై ‘డ్రాగన్’ బ్యూటీ క్లారిటీ!

kayadu lohar

ఇటీవల మన సౌత్ సినిమా దగ్గర ఒక్క సినిమాతోనే ఫేట్ మార్చుకున్న అతి కొద్ది మంది హీరోయిన్ లలో డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కూడా ఒకరు. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాతో స్టార్ అయ్యింది. ఇక అక్కడ నుంచి పలు సినిమాలు వరుసగా చేస్తున్న తాను తన పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై స్పందించింది.

ఎక్స్ (ట్విట్టర్) యాప్ లో తన పేరిట పలు పోస్ట్ లు ఇటీవల ఒకింత చాలా మందికి షాకింగ్ గా అనిపించాయి. నిన్న తమిళ నాట జరిగిన నటుడు విజయ్ రాజకీయ సభకి సంబంధించిన విషాదంపై ఓ కాంట్రవర్సీ పోస్ట్ కూడా రావడంతో దానిని ఆమెనే చేసింది అని చాలా మంది అనుకున్నారు.

కానీ కయాదు తన ఒరిజినల్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసి తన పేరిట జరుగుతున్న ఫేక్ అకౌంట్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని తేల్చింది. నిజానికి ఆ సభ విషయంలో జరిగిన విషాదం పట్ల చాలా చింతిస్తున్నాను అని దయచేసి తన పేరు మీద జరుగుతున్న అలాంటి ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని ఆమె ఓ క్లారిటీ అందించింది.

Exit mobile version