మోహన్ బాబు గారికి పిత్రు వియోగం

డాక్టర్ మోహన్ బాబు గారి తండ్రి శ్రీ మంచు నారాయణస్వామి నాయుడు సోమవారం ఉదయం మరణించారు. తిరుపతిలోని శ్రీ విద్యా నికేతన్ ప్రాంగణంలో ఆయన ఈ ఉదయం మరణించారు, ఆయన వయసు సుమారు 95 సంవత్సరాలు. నారాయణ స్వామి నాయుడు చనిపోయిన సమయంలో మోహన్ బాబు ఆయన పక్కనే ఉన్నారు. నారాయణ స్వామి నాయుడు మధ్య తరగతి రైతు నుండి స్కూల్ హెడ్ మాస్టర్ గా కూడా పనిచేసారు. ఆయన సంతానంలో మోహన్ బాబు పెద్దవాడు. పలువురు ఇండస్ట్రీ పెద్దలు ప్రముఖులు సంతాపం తెలిపారు.

123తెలుగు.కాం శ్రీ నారాయణస్వామి నాయుడు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము.

Exit mobile version