ఈ రోజు సినిమాలకు రెండు పెద్ద అడ్డంకులు

ఈ రోజు సినిమాలకు రెండు పెద్ద అడ్డంకులు

Published on Jun 14, 2013 9:02 AM IST

Something_Something-and-Sar
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ‘సరదాగా అమ్మాయితో’, ‘సమ్థింగ్ సమ్థింగ్’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఎ సినిమాకైనా మొదటి రోజు బాక్స్ ఆఫీసు వద్ద వచ్చే కలెక్షన్స్, టాక్ చాలా ముఖ్యం. కానీ ఈ రెండు సినిమాలు ఈ రోజు రిలీజ్ అయినప్పటికీ హైదరాబాద్లో పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

తెలంగాణ నాయకులు, ప్రజలు కలిసి చేస్తామన్న ‘చలో అసెంబ్లీ’ కి అనుమతి రాకపోవడంతో, ఎలాగైనా చలో అసెంబ్లీ నిర్వహించాలని తెలంగాణ వాదులు నిర్ణయించారు. దాంతో హైదరాబాద్ మొత్తం బారికేడ్స్ పెట్టారు, వైర్ ఫెన్సింగ్ లు, ఆర్మీ పోలీస్ బెటాలియన్స్, సిటీలో 144 సెక్షన్, అలాగే చెక్ పోస్ట్ లు పెట్టి బాగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వం చాలా స్కూల్, కాలేజీలు, మరికొన్ని సంస్థలు మూతపడ్డాయి.

దీనికి తోడు గత కొద్ది రోజులుగా సిటీలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుత వాతావరణం ప్రకారం ఈ రోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు సినిమా థియేటర్స్ కి వెళ్తారా? అనే అనుమానం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల ముందున్న రెండు పెద్ద సమస్యలు ఇవే, వీటిని అధిగమించి థియేటర్ కి ఎంతమంది వస్తారో చూడాలి.

తాజా వార్తలు