హైదరాబాద్లో పాట చిత్రీకరణతో దూసుకెళ్తున్న విష్ణు

హైదరాబాద్లో పాట చిత్రీకరణతో దూసుకెళ్తున్న విష్ణు

Published on Jun 12, 2013 11:30 PM IST

Doosukeltha-(2)
మంచు విష్ణు మరియు లావణ్య త్రిపాటి నటిస్తున్న ‘దూసుకెళ్తా’ సినిమా హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. స్లోవేనియాలో గతనెల షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్లో హీరో, హీరొయిన్ల మధ్య ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. గణేష్ ఆచార్య ఈ పాటకు నృత్య భంగిమలు సమకూరుస్తున్నాడు. ఈయనతో కలిసి పనిచెయ్యడానికి విష్ణు మరియు లావణ్య ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వీరూ పొట్ల దర్శకుడు. ఈ సినిమాను 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విష్ణు నిర్మిస్తున్నాడు. కోట శ్ర్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, ఆహుతి ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రధారులు. ‘దూసుకెళ్తా’ ఒక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా యొక్క మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తారు

తాజా వార్తలు