టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘దూకుడు’ చిత్రం 2011లో విడుదలై ఆ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా విడుదలైన అన్ని ఏరియాల్లో రికార్డు కలెక్షన్లు సాదించింది. అలాంటి చిత్రం త్వరలోనే మలయాళంలో విడుదల కాబోతోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మలాయంలో కూడా మంచి క్వాలిటీ తో విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి టాప్ డబ్బింగ్ ఆర్టిస్టుల చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు. ఇంకొక నెల రోజుల్లో ఈ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తవుతాయి. మహేష్ బాబు మరియు సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించారు.